Header Ads Widget

header ads
header ads

శాంతి భూషన్ జీవిత చరిత్ర తెలుగు || తెలుగు బయోగ్రఫీ

 ప్రజాస్వామ్యం విలువలు రాజ్యాంగ నిబద్ధత, న్యాయవ్యవస్థ స్వతంత్రతకోసం చివరిక్షణం వరకు పోరాటం చేసిన వారిలో ప్రముఖుడు శాంతి భూషణ్, రాజ్యాంగం ఎన్నోసార్లు సవరించబడింది. అందులో అధికశాతం ఇందిరాగాంధీ హయాంలో జరిగినవే. అటువంటి సవరణలో కీలకమైనది 34వ సవరణ, ప్రధానిగా తానుచేసిన తప్పులను ప్రశ్నించ టానికివీలులేని విధంగా రాజ్యాంగంద్వారా ఒక రక్షణ కవచం నిర్మించేయత్నం చేసింది ఇందిరాగాంధీ.


అది రాజ్యాంగవిరుద్ధం అంటూ సుప్రీమ్ కోర్టు ముందు వాదించి ఒప్పించి, ఆ రాజ్యాంగ సవరణను కొట్టేయించగలిగిన వాదనా పటిమ శాంతిభూషణ్. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ప్రభుత్వం చేసిన ఒక రాజ్యాంగ సవరణను కొట్టివేయటం అనే తొలి సారి, ఆ ఘనత సాధించింది శాంతిభూషణ్



రాజ్యాంగపు ప్రాథమిక నిర్మాణపు అంశాలు ముట్టు కునేందుకు వీలులేదు అనే వాదన చేసినవాడు శాంతి భూషణ్, 'బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కానిస్టిట్యూషన్' అనే పదం శాంతి భూషణ్ వాడినప్పుడు నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎన్.కే "బేసిక్ స్ట్రక్చర్ నా అదేమిటి?" అపహాస్యం చేశాడు.


ఆ తర్వాత శాంతి భూషణ్ ఎమ్.పి.గా గెలిచి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా రాజ్యాంగపు 44వ సవ రణ తీసుకువచ్చి రాజ్యాంగపు మౌలిక సూత్రాలు ముట్టుకునేందుకు వీలులేకుండా చేయగలిగాడు.


శాంతి భూషగి న్యాయవాదుల కుటుంబం. తండ్రి అలహాబాద్ కోర్టులో న్యాయవాది తన కొడు కుని ఐ.సి.ఎస్.ఆఫీసర్ గా చూడాలన్నది తండ్రికోరిక. కాని చిన్నతనంనుండి ఇంటిలో వాతావరణం, తం డ్రితో కలిసి కోర్టుకు వెళ్ళిచూసిన వాదోపవాదాలు వగైరాలు గమనించిన శాంతి భూషణ్ మనసు న్యాయవాద వృత్తిమీదకే వెళ్ళింది


  • ఎక్కడా ఇమడలేని ఇమేజ్ శాంతిభూషణ్. ఆయన ఒక రెబెల్. అవినీతిని సహించలేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత విషయంలో రాజీ ఒప్పుకోడు. అటువంటి న్యాయవ్యవస్థలోనే అవినీతి వచ్చిందనేది శాంతి భూషణ్ ఆరోపణ. "నిజాయితీతో కూడిన న్యాయవ్యవస్థను భారతీయ ప్రజలకు అందించటానికి నేను జైలుశిక్ష అనుభవించేందుకు సిద్దమే"నని కోర్టుకు చెప్పాడు.


ఎవరు ఏమనుకున్నా నల్లకోటు నా ఆయుధం అని విద్యార్థి దశలోనే అనుకున్నాడు. లాయర్ వృత్తి చేపట్టిన తర్వాత అత్యుత్తమ లాయర్ గా ఎదిగాడు. అద్భుతమైన పాయింట్స్ పట్టగలిగిన నేర్పు. వాదనా పటిమ వున్నందున అత్యధిక ఫీజు తీసుకునే సుప్రీమ్ కోర్టు లాయర్ అనిపించుకోగలిగాడు. ఏదీ ఉచితం కాదు దేనికైనా ఫీజు కట్టాల్సిందే అని చివరికి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు ఫీజు తీసుకునేవాడు.


నౌటి టాప్ లాయర్స్ లాగానే శాంతి భూషణ్ కాంగ్రెస్ పార్టీలోవుండేవాడు. 1969లో కాంగ్రెస్చేవ తర్వాత ఇందిరా గాంధీ వ్యతిరేక వర్గం అయిన ఓల్డ్ కాంగ్రెస్లో చేరాడు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా రాజ్నారాయణ వేసిన పిటీషన్లో వాదించి, ఆమె పార్లమెంట్ సీటు రద్దు చేయించిన లాయర్ శాంతి భూషణ్. దాని ఫలితంగా వచ్చిన ఎమర్జెన్సీ, ఆకృత్వా అన్నీ వ్యతిరేకించాడు. 1977లో జనతాపార్టీలో చేరి, గెలిచి, న్యాయశాఖమంత్రి అయ్యాడు. 1980లో బిజెపి ప్రారంభమైనప్పుడు అందులో చేరి, వారి పద్ధతులు నచ్చక 1986లో బయటకువచ్చాడు.


అవినీతి వ్యతిరేక ఉద్యమం అన్నాహజారే ఆరం బించినప్పుడు ఆ ఉద్యమంలో భాగస్వామి శాంతి భూషణ్. ఆ ఉద్యమం పాప్యులారిటీ వాడుకుని ఆమ్ ఆద్మీ పార్టీని కేజీవాల్ పెట్టటంలో శాంతిభూషణ్ పాత్ర వుంది. 2012లో 'ఆప్' వ్యవస్థాపక సభ్యుడు. 2014 కల్లా ఆప్ 'లో ఇమడలేక బయటకు వచ్చాడు.


ఎక్కడా ఇమడలేని ఇమేజ్ శాంతిభూష ఆయన ఒక రెబెల్. అవినీతిని సహించలేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత విషయంలో రాజీ ఒప్పుకోడు. అటువంటి న్యాయవ్యవస్థలోనే అవినీతి వచ్చిందనేది శాంతి భూషణ్ ఆరోపణ. న్యాయమూర్తుల పై ఆరోపణలతో ఒక దశలో కోర్టు ధిక్కారణ కేసు పెట్టారు. "నిజాయితీతో కూడిన న్యాయవ్యవస్థను భారతీయ ప్రజలకు అందించటానికి నేను బైలుశిక్ష అనుభవించేం దుకు సిద్ధమే"నని కోర్టుకు చెప్పాడు.


చట్టానికి ఎవరూ అతీతులు కారు అంటూ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు పలు రకాలుగా సవాళ్ళు విసిరాడు. 90 ఏళ్ళ వయసులో కూడా వాదించేందుకు పిలిసెయిల్లో కోర్టుకు వచ్చిన సాహసి ఆయన. 2018లో తన 93వ ఏట న్యాయ మూర్తుల నియామకం విషయంలో పిటీషన్ వేశాడు. న్యాయమూర్తులకు కేసులు కేటాయంచే విషయంలో ప్రధాన న్యాయమూర్తికి వున్న విశేష హక్కును సవాలు చేశాడు. కొన్ని కేసులు తక్షణమే ఎందుకు పరిష్క రిస్తారు. కొన్ని కేసులను న్యాయస్థానం పట్టించుకోదు అని శాంతిభూషణ్ వేసిన ప్రశ్నలకు న్యాయస్థానం. నాటి ప్రధాన న్యాయమూర్తులు ఉక్కిరి చిక్కిరి అయ్యారు.


అసలు న్యాయమూర్తుల నియామకంలో ప్రజల పాత్ర వుండాలన్నాడు శాంతిభూషణ్, సుప్రీమ్ కోర్ట్బుకి ఒక వ్యక్తిని నియమించే ముందు అతని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వివటం మంచిదన్నది శాంతి భూషణ్ వాదన.


శాంతిభూషణ్ పిటీషన్లో వస్తున్నాడు అంటే న్యాయమూర్తులు ఇబ్బంది పడేవారు. ఈయనకు ఈ వయసులో నీ పని లేదా. హాయిగా ఇంట్లో కూర్చోక అని సణిగేవారు. శాంతిభూషణ్ కి ఏదో ప్రత్యేక ఎజెండా వుందని, ఎవరికోసమో పని చేస్తున్నాడని, విదేశీ నిధులు వారి కుటుంబానికి అందుతున్నాయన్న వార్తలు వచ్చాయి. అయినా సరే ఆయన లెక్కచేయ లేదు. ధర్మం పైపే వుంటా, నిజమే చెబుతా, న్యాయ వ్యవస్థ ప్రక్షాళనకోసం కృషి చేస్తా అంటూ తన 95వ ఏల కూడా ప్రకటించాడు.


శాంతిభూషణ్ కొడుకు ప్రశాంతిభూషణ్ కూడా సుప్రీమ్ కోర్టు న్యాయవాది. కొడుకు సహాయంతో వాదనలు చేసేవాడు. జంటగా తండ్రీకొడుకులు చేసిన న్యాయయుద్ధాలు వున్నాయి.


ప్రతి మనిషి ఏం అవుతాడో భగవంతుడు నిర్ణయి స్తాడు. కాని విధిని నమ్ముకుని మన ప్రయత్నం ఆప కూడదు. గాలిలో దీపం పెట్టి దేవుడా అనకూడదు. మనిషిశ్రమించాలి. ఓపిక వున్నంతవరకు పనిచేయాలి అనే శాంతి భూషణ్ తన 97వ ఏట వరకు మానసి కంగా చురుకుగా వ్యవహరించాడు. వయోభారంతో వున్న ఇతరసమస్యలు ఇంటికి పరిమితంచేసినా పోరా టానికి సిద్ధం అంటూ సందేశం పంపిన శాంతిభూషణ్ ఈ ఏడు ప్రారంభంలో మరణించాడు.

Post a Comment

0 Comments