Header Ads Widget

header ads
header ads

రాజ్ గురు బయోగ్రఫీ తెలుగు || రాజ్ గురు జీవిత చరిత్ర తెలుగు

 స్వాతంత్ర సమరయోధుడు గాంధీజీ అంటే ఆయన అహింసా విధానాన్ని వ్యతిరేకించిన అతి వాదులు కూడా గౌరవించిన వ్యక్తిత్వం గాంధీజీ.



అటువంటి గాంధీ మహాత్మునిమీద కరాచీ నగ రంలో ఒక్కసారి ఒక యువకుడు దాడికి పాల్పడ్డాడు. ఆ దాడికి కారణం ఆ యువకుడిలో వచ్చిన కోపం. ఆ కోపానికి మూలం నాడు బ్రిటీష్ వారు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లను ఉరితీయటం.


గాంధీ జోక్యంచేసుకునుంటే ఆ ఉరి ఆగి వుండే దన్న నమ్మకం నాటి యువతలో వుండేది. తన అహింసా సిద్ధాంతానికి అనువుగా వ్యవహరించనం దున గాంధీ ఆ ఉరి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేదు. అయినా ఆనాడు ఉరికంబం ఎక్కిన ఆ ముగ్గురు యువకులు గాంధీజీమీద తమకు ఏమాత్రం కోసం లేదనే అన్నారు. బ్రిటీష్ పోలీసు అధికారి హత్యకేసులో ఉరిశిక్ష విధించబడిన ఆ ముగ్గురిలో భగత్సింగ్ పేరు అందరికీ బాగా తెలుసు.


భగత్సింగ్తోపాటు అంతే వీరోచితంగా విప్లవ మార్గం ఎంచుకున్న యువకుడు రాజ్ గురు గురించి అంతగా గుర్తుపెట్టుకోలేదు సమాజం. 


రాజ్ గురు మహారాష్ట్రకి చెందినవాడు. పూనా వున్న ఖేడ్ గ్రామం అతనిది. ఆగష్టు 24, 1908న పుట్టిన రాజ్ జ్ గురు ఇంగ్లీషులో చదవటం బానిసత్వం అని మాతృభాష మరాఠీని ఎంచుకున్నాడు.


బాలగంగాధర్ తిలక్ ప్రసంగం విని ఉత్తేజితుడై ఆయన దీవెనలు పొందాడు. 1919లో జరిగిన జలి యన్ వాలాబాగ్ సంఘటన తర్వాత రక్తం ఉడికి పోయి స్వాతంత్ర్య పోరాటంలోకి వెళతానన్నాడు.


ఆ తర్వాత కాశీ పట్టణం చేరాడు. అక్కడ చంద్ర శేఖర్ అజాద్ పరిచయం రాజ్ గురుని విప్లవ మార్గంలోకి తీసుకువెళ్ళింది.


అక్కడనుండి భగత్ సింగ్ బృందం ప్రారంభిం చిన హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ ఆర్మీలో సభ్యుడయ్యాడు. నాటినుండి చివరివరకు భగత్సింగ్ అనుచరుడిగా నడిచినవాడు రాజ్ గురు.


1927లో సైమన్ కమిషన్ భారత్ని సందర్శించిన తెలియచేశారు. ఆ నిరసన ప్రదర్శనకు లాహోర్ నగరంలో నాయకత్వం వహిస్తున్న లాలాలజపత్ రాయ్్మద పోలీస్ లాఠీ విరిగింది.


ఆ గాయానికి ఆయన ఆ తర్వాత ఆసుపత్రిలో మరణించాడు. ఆ పోలీసు అధికారిని అంతమొందించి, ప్రతీకారం తీసుకునేందుకు పాల్గొన్న బృందంలో రాజ్ గురు వున్నాడు. ఆ తర్వాత సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు పేల్చిన కేసులో రాజగురు లేడు. తనకు అవకాశమివ్వలేదని భగత్ సింగ్ మీద అలిగాడు.


లాహోరుండి తప్పించుకుని, పోలీసులకు పట్టు బడక మహారాష్ట్రకు చేరాడు రాజ్ గురు. ఈలోగా భగత్సింగ్ అరెస్టు అవటం, అతని భాగస్వాములు కొందరు ప్రభుత్వానికి అనుకూలంగా మారటంతో రాజగురు పేరు పోలీసులకు తెలిసిపోయింది.


దాదాపుగా రెండేళ్ళ తర్వాత పూనాలో వున్న రాజ్ గురును 1929 సెప్టెంబర్ లో అరెస్టుచేసి లాహోర్ తీసుకువెళ్ళారు. ముందు కోర్టులో విచారణ చేసినా అది ముందుకు సాగటంలేదని ప్రత్యేక ట్రిబ్యునల్ సరిగ్గా ఇవ్వకుండా, వారి అభ్యంతరాలను తోసి ఏర్పాటుచేసి, నిందితులకు ఇవ్వాల్సిన అవకాశాన్ని పుచ్చుతూ రాజగురుకి ఉరిశిక్షను అక్టోబర్ 7, 1930న ఖరారు చేశారు. నిందితులు జడ్జి ఎదుట లేకుండా విధించిన శిక్ష అది.


సరిగ్గా ఆ సమయంలో జైలుకి రాజ్ గురు తల్లి కాని రాజ్ గురు మాత్రం అమ్మా నీకిద్దరు కొడుకులు, అందులో ఒకరిని భరతమాతకు ఇచ్చావు. నీకు ఒక్కడే కొడుకు ఇప్పుడు" అంటూ నవ్వుతూ చెప్పాడు. అప్పటికి అతని వయసు 22.


ఉరి శిక్ష తపించాలని ఆ యువకుల తరుపున పలు ప్రయత్నాలు చేశారు కొందరు ప్రముఖులు. ఉరిశిక్ష తప్పించాలని ఆ యువకుల తరపున కాని అవన్నీ విఫలమయ్యాయి.


శిక్షపడినవారే క్షమాభిక్ష అడగాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు రాజ్గురు ఉగ్రుడయ్యాడు. 'బ్రిటీష్ ప్రభుత్వాన్ని క్షమాభిక్ష అడగాల్సినంత తప్పు ఏం చేసాం మేము అంటు ఎదురు ప్రశ్న వేసాడు


చివరికి మేము సాధారణ నేరస్తులం కాము. మేము బ్రిటీష్ ప్రభుత్వంమీద యుద్ధంచేశాం. కాబట్టి యుద్ధ ఖైదీలం. కాబట్టి "మమ్మల్ని కాల్చి చంపండి... ఉరి తీయటం కాదు" అంటూ ఉరికి మూడురోజుల ముందు ప్రదర్శించిన ధైర్యం రాజ్ గురుది.


మార్చి 24, 1931ని ఉరి తేదీగా నిర్ణయించారు. ఆ విషయం తెలిసికూడా రాజ్ గురు ముఖంలో ఎటువంటి ఆందోళనా లేదు.


తన మిత్రులతో కలిసి గతంలో చేసుకున్న బాసలు గురించి మాట్లాడుకుంటున్నారు. జైలులో వుండగా ఒకసారి ముగ్గురూ నిరాహారదీక్ష చేశారు.


దేశమంతా వారి ఉరిగురించి అట్టుడికిపోతోంది. ఇక వీరిని ఇలాగే వుంచితే కష్టమని ఉరిని ఒకరోజు ముందుకు జరిపారు.


తమని సంకెళ్ళు లేకుండా ఉరికంబానికి తీసుకు వెళ్ళమన్న కోరిక ఒక్కటే కోరారు.

సాధారణంగా ఉరి వేకువజామున తీస్తారు. కాని నిర్దేశించిన రోజుకన్నా ముందురోజు సాయంకాలమే వారిని ఉరికంబానికి నడిపించారు.


భగత్సింగ్ కి కుడివైపున నడిచాడు రాజ్ గురు, 'ఇంక్విలాబ్ జిందాబాద్' వివాదంతో ఉరివేదిక ఎక్కారు. మిగిలినదంతా వేగంగా జరిగిపోయింది.జైలులో వున్న మిగిలిన ఖైదీలు తమ తమ గదుల్లో నుండే 'ఇంక్విలాబ్ జిందాబాద్', భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ 'జిందాబాద్' అని అరుస్తున్నారు.


రాజ్గురు భగత్సౌంగ్తో చూపులు ఒక్కసారి కలిపాడు. ఉరితాడును ముద్దాడాడు.


పైలోకంలో కూడా ఒకరికొకరం తోడుగా వుందాం. అన్నట్టుగా చూస్తూ మరోసారి 'ఇంక్విలాబ్ జిందాబాద్' అంటూ ఉరికంబానికి వేళ్ళాడారు. 23 ఏళ్ళుకూడా రాకుండా తన జీవితాన్ని దేశం కోసం అర్పించిన భరతమాత ముద్దుబిడ్డడు రాజ్ గురు.

Post a Comment

0 Comments