నల్లజాతిపై తెల్లవారు చేసిన దౌర్జన్యాలపై పోరాటం సలిపినది నెల్సన్ మండేలా అయితే నల్లవారందరికీ నైతిక మద్దతును ఇచ్చి ఆ పోరాటం విజయం చేసింది డెస్మండ్ టుటు.
సాటివారిని ప్రేమించమన్న జీసస్ బోధనలు నమ్మేతెల్లవారు ఆఫ్రికా ఖండంలోని నల్లవారికి క్రైస్తవం అంటగట్టగలిగారుకాని వారిని ప్రేమించలేక పోయారు. తొలుత నల్లవారిని బానిసలుగా అమ్ముకు న్నారు. ఆ తర్వాత ఆఫ్రికాను ఆక్రమించుకున్నారు. దోచుకున్నారు. ఆఫ్రికాకి సొంతదారులైన నల్ల | వారిని పక్కకు నెట్టి పాలన సాగించారు.
వర్ణ వివక్షత విధానంతో వేధింపులకు గురవుతున్న నల్లవారికి జీసస్ బోధించిన శాంతి, మహాత్మాగాంధీ అందించిన సత్యాగ్రహ మార్గం ద్వారా పోరాట స్ఫూర్తినిచ్చిన క్రైస్తవ మత పెద్ద డెస్మండ్ టుటు. సుదీర్ఘ పోరాటంతర్వాత తెల్లవారి పాలన అంతమైంది. దక్షిణాఫ్రికాలో అధికారం నల్లవారి చేతిలోకి వచ్చింది. శతాబ్దాల తరబడి తమని శరీరం రంగు పరంగా వేధించిన తెల్లవారిమీద కుతకుత లాడిపోయింది నల్లవారి సమాజం.
వారిలోని కసి, పగ హద్దులు దాటి వుంటే తెల్లవారి రక్తంతో ఆఫ్రికా ఖండ నదులు ఎర్రబడివుండేవి. కాని తమకు అన్యాయం చేసినవారిని క్షమించనున్న ఏసు బోధనను గుర్తించి, నల్లజాతివారికి వాస్తునాలను వెలుగులోకి తెచ్చి క్షమించగలిగిన స్థాయికి తీసుకువెళ్ళినవాడు డెస్మండ్ టుటు.
తెల్లవారి ఆకృత్యాలను బయటపెట్టి, వారితో సర్దుకుపోవటం ఎలానో తెలియచెప్పేందుకు నెల్సన్ మండేలా నియమించిన దక్షిణాఫ్రికా ట్రూత్ అండ్ రికన్సిలేషన్ కమిషన్కి ఛైర్మన్ గా పనిచేసినవాడు. డెస్మండ్ టుటు. దక్షిణాఫ్రికాలో మత పెద్దగా. ఆర్చి బిషన్ గా డెస్మండ్ టుటు నైతికతకు నిలువుటద్దంగా నిలిచాడు. ఆర్థిక పరిస్థితి సహకరించక మెడిసిన్ చెయ్యలేకపోయాడు. ఆ పైన ఇంగ్లీషులో ఎమ్.ఎ.చేసి | టీచర్ గా పనిచేశాడు.ఆయనది ఆంగ్లికన్ క్రైస్తవం.
ప్రేమించిన అమ్మాయిది రోమన్ కాథలిక్ క్రైస్తవం. తన మతం ప్రకారమే వివాహం జరగాలని కాబోయే భార్య అడిగితే ప్రేమకోసం రాజీపడి రోమన్ కాథలిక్ చర్చిలో వివాహం చేసుకున్నాడు. నాటి జాత్యహంకార ప్రభుత్వ విధానాలకు నిరసనగా టీచింగ్ ఉద్యోగం వదిలి మతబోధకుడిగా మారాడు.
నల్లవారి స్వాతంత్ర్యంకోసం జరిగే ఉద్యమంలో టుటు స్నేహితుడు మండేలా ప్రత్యక్షంగా పోరాడుతుండగా ఈయన నైతిక మద్దతు నిస్తూ, అంతర్జాతీయంగా నల్లవారి స్వాతంత్ర్య స్వరం వినిపించాడు. 1984లో అంతర్జాతీయ శాంతి విభాగంలో డెస్మండ్ టుటు నోబెల్ విజేత అయ్యాడు.
1961లో డెస్మండ్ టుటుకి చర్చి పాస్టర్గా అవకాశం వచ్చింది. నాటినుండి క్రమంగా చర్చిలో ఎదిగాడు. 1967లో ఛాప్లిన్గా 1985 నాటికి తొలి నల్లజాతి ఆంగ్లికన్ బిషన్ అయ్యాడు. 1986 నాటికల్లా ఆర్చి బిషిప్ స్థాయికి ఎదిగాడు. నల్లవారి స్వాతంత్య్రంకోసం జరిగే ఉద్యమంలో టుటు స్నేహితుడు మండేలా ప్రత్యక్షంగా పోరాడుతుండగా ఈయన నైతిక మద్దతునిస్తూ, అంతర్జాతీయంగా నల్లవారి స్వాతంత్య్ర స్వరం వినిపించాడు. 1984లో అంతర్జాతీయ శాంతి విభాగంలో డెస్మండ్ నోబెల్ విజేత అయ్యాడు.
1994లో జాత్యహంకార ప్రభుత్వం పతనమై, మండేలా దేశాధ్యక్షుడవగా, డెస్మండ్ టుటు దేశంలో శాంతిస్థాపనకు తన కమిషన్ద్వారా కృషిచేశాడు. ఆయన శ్రమవల్లనే దక్షిణాఫ్రికాలో ప్రశాంతత నెలకొన్నది. దేశాన్ని చక్కదిద్దిన డెస్మండ్ టుటుకి వ్యక్తిగతంగా అనారోగ్యం వచ్చింది. 1997లో ఆయనకు క్యాన్సర్ సోకిందని గుర్తించారు.
ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే ప్రజా జీవితం కొనసాగించాడు. తన మనసులోని భావాలను దాచుకోలేని మనస్తత్వం, నల్లవారి పాలనలో తనకు తగి నంత గౌరవం దక్కటంలేదనే బాధ డెస్మండ్ టుటుని ఇబ్బంది పెట్టాయి. ఆ ఇబ్బందిలో నెల్సన్ మండేలా మీద విమర్శలు గుప్పించాడు.
దక్షిణాఫ్రికాని 'రెయిన్ బో నేషన్'గా వర్ణించింది. డెస్మండ్ టుటు. తన ఊహలకు తగిన విధంగా దేశం రూపుదిద్దుకోవటంలేదన్న బాధను వ్యక్తీకరించే వాడు. తనకు వచ్చిన ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ చికిత్సకి విదేశాలకు వెళ్ళినా పురుషులందరికీ హెచ్చరిక, మీ ప్రోస్టేట్ని చూసుకోండి అంటూ సందేశాలు పంపేవాడు డెస్మండ్ టుటు.
ఆయనకు ఇంటా బయటా ఎన్నో అవార్డులు వచ్చాయి. అయినా ఎక్కడో తనను తక్కువ చేస్తున్నారన్న భావనతో వుండేవాడు. అయితే తన సొంత భావాలతో కుదరనప్పుడు మతాన్ని ధిక్కరించేవాడు. క్రైస్తవం స్వలింగ వివాహాలకు వ్యతిరేకం.
కాని డెస్మండ్ టుటు సొంత కూతురు విదేశాలలో అటువంటి వివాహం చేసుకోవటంతో తన అభిప్రాయం మార్చుకుని వెళ్ళి కూతురు పెళ్ళి జరిపించి విమర్శలకు గురయ్యాడు. తన 79వ పుట్టిన రోజున ప్రజా జీవితంలో నుండి తప్పుకుంటున్న ప్రకటన చేశాడు. కాని ఆయన నోరు ఆగేది కాదు.
"ఏం చెయ్యను. నాకు నోరు విప్పకూడదనే వుంటుంది. ఎవరెటుపోతే నాకేం అనుకోలేదు. ఎదురుగా అన్యాయం, అవినీతి కనపడుతుంటే ఎలుగెత్త కుండా ఎలా ఉండటం" అనేవాడు.
డెస్మండ్ టుటులోని సహజ హాస్యప్రియత్వం, ఆయన ప్రత్యేకమైన ముఖకవళికలు ప్రపంచానికి బాగా గుర్తుండేవి. అంతర్జాతీయ నాయకులంతా ఆయనకు మద్దతుగా నిలిచేవారు. చివరి పది సంవత్సరాలు ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్కి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళటం, ఆ చికిత్సవల్ల వచ్చిన అంటు రోగాల నుండి బయటపడేందుకు ఇతర చికిత్సలు చేయించుకోవటం చేశాడు డెస్మండ్ టుటు.
తనను చూడటానికి వచ్చినవారితో నవ్వుతూ హాయిగా మాట్లాడేవాడు. మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అడిగితే- ద్వేగాలను దాచుకోకుండా ప్రదర్శించినవాడిగా, "అందరినీ ప్రేమించినవాడిగా, నవ్వు, ఏడుపు భావో క్షమాపణ కోరినవాడు, క్షమాపణ అందించినవాడిగా గుర్తుపెట్టుకోమన్నాడు డెస్మండ్ టుటు.
అక్టోబర్ చర్చిలో ప్రార్థనలకు, చక్రాల కుర్చీలో క్యాన్సర్ బలహీనపరచగా తన 90వ పుట్టినరోజున వచ్చిన డెస్మండ్ టుటు డిశంబర్లో క్రిస్మస్ వెళ్ళిన విడిచి ప్రభువు చెంతకి చేరాడు. మరుసటి రోజే నిద్రలోనే ప్రశాంతంగా ప్రాణాలు విడిచి ప్రభువు చెంతకీ చేరాడు
0 Comments