Header Ads Widget

header ads
header ads

రస్ఫూతిన్ బయోగ్రఫీ జీవిత చరిత్ర తెలుగు

 పాలకుల పతనానికి ఆయన పక్కన చేరిన సలహాదారులే కారణమవుతారన్నది చరిత్ర. కాలం ఆ సలహాదారుని ముందుగా అంతం చేసి, ఆతర్వాత పాలకుడి పతనాన్ని శాసిస్తుంది. ఆ విషయం స్పష్టమవుతుంది రస్సుతిన్ జీవితాన్ని గమనించినప్పుడు. ఒక సాదాసీదా రష్యన్ కుటుంబంలో పుట్టిన రస్సుతిన్ క్రైస్తవసన్యాసిగామారాడు. దేశదిమ్మ రిగా తిరిగే క్రైస్తవ సాధువయ్యాడు. తనకు అతీం ద్రియశక్తులున్నాయని ప్రకటించుకున్నాడు.నమ్మకం .దానికి కారణం 1912లో రష్యన్రాణి కొడు హిమోఫిలిక్ వ్యాధి నుండి కాపాడిన సంఘటన. గాయం అయితే కారుతున్న రక్తం గడ్డకట్టకపోవటం హీమోఫిలిక్ జబ్బు. ఆ జబ్బుతో వున్న రాణి కొడుక్కి గాయం అయింది. రక్తస్రావాన్ని వైద్యులు ఆపలేక పోయారు. రాణి రస్పుతిన్కి సందేశం పంపగా, అతను ఇచ్చిన సలహాలు పాటించమన్నాడు.


పెళ్ళి, సంసారం, పిల్లలు వున్నా అతనిలో వికృత లైంగిక కోర్కెలు వుండేవి. పేరుకు సాధువు, కాని అతనో కామపిశాచి అనేవారు. వికృత లైంగిక సంబంధాలతో ఆడవారిని లోబరుచుకునేవాడు. అతని అతీంద్రియ శక్తుల గురించి విస్తృతంగా ప్రచారం జరిగింది. ఎందరో రష్యన్ క్రైస్తవులు అతనికి శిష్యు లయ్యారు. నాటి రష్యా రాజధాని సెయింట్ పీటర్స్ బర్గ్ వున్నప్పుడు రస్సుతిన్ గురించి విన్న రష్యన్ రాణి అంతఃపురంలోకి అడుగుపెట్టింది.



అలా 1905లో రష్యా అంతఃపురంలోకి చేరిన రస్సుతిన్కి సలహాదారుడు, ఆధ్యాత్మిక గురువు, విశ్వాసంతో రోగాలను నయం చేయగలిగిన మాంత్రి కుడయ్యాడు. రాజవంశీకుల బలహీనతలను తనకు అనుకూలంగా వాడుకున్నాడు. ఐదారేళ్ళపాటు రస్సు తిన్ది ఆడింది ఆట పాడింది పాట.


రాణి, రాణిసంతానంతో కూడా చిత్రమైన సంబం ధాలు అతనివి. రస్సుతిన్ అంటే అసహ్యం మొదలైంది. 1910 నుండి ఇతడు అమాయకపు ఆడపిల్లల ను తన మాయమాటలతో లోబరుచుకుంటున్నాడు. ఇతగాడు ఒక మోసగాడు. అతను చెప్పే ఏసు బోధన లకు అతడు చేసే పనులకు పొంతన లేదు.


ఇతడికి వయస్సు వరస తెలియదు. అందరితో లైంగిక ఆలోచనలే. అతని చూపులే ప్రమాదకరమై నవి అనే మాటలు పలువురు ఆడవాళ్ళు చెప్పటం మొదలైంది. రాణిగారి పిల్లలతో అసభ్యంగా ప్రవర్తి స్తున్నాడు. ఆ ఆడపిల్లలు అతని మత్తులో వున్నారు అని రాణికి హెచ్చరిక చేసింది పిల్లల సంరక్షణ కోసం నియమించిన మనిషి కాని రాణి అలెగ్జాండ్రిన దానిని నమ్మలేదు.


రస్సుతిన్కి విశేషమైన శక్తులున్నాయి. అతడు దైవాంశసంభూతుడు. నా క్షేమం కోసం ప్రభువు రస్పుతిన్ని. నా దగ్గరికిపంపాడు" అనేది రష్యన్ రాణి నమ్మకం.దానికి కారణం 1912లో రష్యన్రాణి కొడు హిమోఫిలిక్ వ్యాధి నుండి కాపాడిన సంఘటన. గాయం అయితే కారుతున్న రక్తం గడ్డకట్టకపోవటం హీమోఫిలిక్ జబ్బు. ఆ జబ్బుతో వున్న రాణి కొడుక్కి గాయం అయింది. రక్తస్రావాన్ని వైద్యులు ఆపలేక పోయారు. రాణి రస్పుతిన్కి సందేశం పంపగా, అతను ఇచ్చిన సలహాలు పాటించమన్నాడు.


  • పెళ్ళి సంసారం, పిల్లలు వున్నా అతనిలో వికృత లైంగిక కోర్కెలు వుండేవి. పేరుకు సాధువు, కాని అతనో కామపిశాచి అనేవారు. వికృత లైంగిక సంబంధాలతో ఆడవారిని లోబరుచుకునేవాడు రస్పుతిన్, అతని అతీంద్రియ శక్తుల గురించి విస్తృతంగా ప్రచారం జరిగింది.


తమ దేవుడితో మాట్లాడానని, దేవుడు ఆ రక్త స్రావం తగ్గిస్తానన్నాడని రస్పుతినిచెప్పాడు. ఆ రోజు నిజంగానే రక్తస్రావం తగ్గిందట. ఇక అప్పటి నుండి రస్పుతిన్ మాటకు రష్యా అంతఃపురంలో తిరుగు లేదు. తనకు ఎదురుచెపుతున్న లేదా తన ప్రవర్తన | మీద సందేహాలు చేరవేసే వారందరినీ రాణికి చెప్పి ఉద్యోగాల నుండి తొలగించాడు.


రస్పుతిన్ మీద వ్యతిరేకత తీవ్రమవుతోంది. ఆడవాళ్ళు రాణిగారి వ్యక్తిత్వాన్ని అనుమానించటం మొదలు పెట్టారు. రస్సుతిన్ తన లైంగికశక్తితో ఆమెను లొంగదీసుకున్నాడనేది ఆడవారి సందేహం. ఆ అనుమానం సమాజంలోకి బాగా కిందివారికి చేరి 1914 జాలై 12న ఒక రైతు వనిత రస్సుతిన్ని కత్తితో కడుపులో పొడిచింది.


నువ్వు చస్తేకాని మా దేశానికి పట్టిన పీడవదలదు అంటూ ఆమె పొడిచిన పోటుకి రక్తం బాగా పోయింది. బ్రతకడనుకున్న రస్సుతినో ్కలు కోవటంతో అతని లోని దైవశక్తులకు మరింత బలం చేకూరింది.


ఆ హత్యాయత్నంచేసిన వనిత క్రైస్తవంలోని మరో వర్గానికి చెందినది. అంతకు ముందు రష్యా రాజుల మీద ఆ క్రైస్తవ వర్గపెద్ద పెత్తనం సాగేది.


రస్పుతిని వచ్చి తమ స్థానం తీసుకున్నాడన్న కసితో హత్యాయత్నం చేయించారు. కుట్రచేసిన క్రైస్తవమత పెద్దలు దేశం వదిలి పారిపోయారు. దానితో పూర్తి పెత్తనం రస్సుతినే అయింది.


రస్పుతిన్తోనే రాణి, రాజు సమయం గడుపుతున్నారు. జార్ చక్రవర్తుల పట్టు తగ్గుతోంది. మిగిలిన రాజవంశాల వారికి కనీసం సంప్రదింపులకు అవకా శం ఇవ్వటం లేదు. రస్పుతిన్ని వదిలించుకో కుంటే తమ రాజ్యం నిలవదని భావించిన అంతఃపుర పురుష బృందం కుట్ర పన్నింది.


చక్రవర్తి మేనల్లుడు ఫెలిక్స్ యుసుపోవ్ తన ప్యాలెస్కి రాత్రి భోజనానికి రస్సుతిన్ని డిశంబర్ 1916లో ఆహ్వానించాడు. ఆ భోజనంలో విషం కలిపి చంపా లన్నది పథకం. భోజనం తర్వాత కిందపడిపోని రస్పుతిన్ని చూసి ఫెలిక్స్కి భయం వేసింది.


నిజంగానే దైవశక్తి వుందా అని సందేహం! ఇప్పుడు రస్పుతిని వదిలేస్తేఅతగాడు తమ ప్రాణాలు తీయిస్తాడన్న వణుకు. ఇక లాభం లేదనుకున్నారు. తుపాకీ తీసుకుని గురిచూసి నుదుటిన కాల్చారు. దానితో కిందపడినా, చావలేదన్న భయం.


అలా భవన బేస్మెంట్ మరిన్ని తూటాలు పేల్చి, అప్పటికీ భయం ఆగక, రస్ఫుతిన్ శరీరాన్ని ఎముకలు కొరికే ఐసో ప్రవహించే నెవ్కే నదిలో పారవేశారు. అలా తాను ప్రభువు ప్రతినిధిని, ఏసు ప్రభువు తనతో నేరుగా మాట్లాడతాడు అంటూ అందరినీ నమ్మించి, లొంగదీసుకుని, వంచించిన రస్సుతిన్ సరిగ్గా క్రిస్మస్ వేళనే తుపాకీకి బలై నదిలో శవంగా తేలటమే చిత్రం.


డిశంబర్ 30న రస్సుతిన్ శవం దొరికింది, అత గాడి పీడ విరగడైందన్న సంతోషంతో రష్యన్లు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. అతడి సమాధి చోట చర్చి నిర్మించాలనుకుంది జార్ రాణి.


కాని అది కొందరికి తిరుగుబాటు స్ఫూర్తినిస్తుం దని భావించిన రాజు, బంధువులు ఆ శవాన్ని తవ్వి తీసి, దహనం చేసి, అసలు ఖననం ఎక్కడ చేసింది. ఆనవాళ్ళు కనపడనియ్యకుండా చేశారు. రాజవంశాన్ని గుప్పిట్లో పెట్టుకున్న సలహాదారుడు రస్పుతిన్ జీవి. తం అలా ఎవరికీ పట్టనివిధంగా అంతమైంది.

Post a Comment

0 Comments