సినీరంగంలో మెరిసిపోయే తారలు వుంటారు. వారి వెలుగులు ప్రత్యేకం. మరోలోకంనుండి దిగి వచ్చిన రీతిలో వుంటుంది వారి నడక, హావ భావాలు, దుస్తులు, మేకప్ అన్నింటా ప్రత్యేకంగా కనిపించినపుడే వారికి గుర్తింపు వస్తుంది.
అయితే అందుకు భిన్నంగా కొంతమంది సాదా | సీదా తారలు తెరమీద వెలుగుతారు. వారిలో ఏ ప్రత్యే కత కనిపించదు. అటువంటి హీరోయిన్లను 'పక్కింటి అమ్మాయి'లాంటిది అనిపిలుస్తుంది సినీపరిశ్రమ.
గర్ల్ నెక్స్ట్ డోర్' ఇమేజ్కి ఏ మాత్రం చింతించ కుండా తన టాలెంట్తో నలుగురిని మెప్పించిన హీరోయిన్ విద్యాసిన్హా చేసిన సినిమాలు తక్కువే "అయినా ఒక కొత్త తార వచ్చింది ఇండస్ట్రీలోకి అని లిపించుకోగలిగింది విద్య,
1970ల్లో కొత్తరకం సినిమాలు మొదలయ్యాయి. వ్యాపార పరంగానేకాక, కళాపరంగా, కథలో కొత్త దనంతో మరీ అంతగా డ్రామా అవసరంలేని మధ్య తరగతి మనుషుల జీవితాల మీద సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమాలను తీసిన దర్శకుల్లో బాసుఛటర్జీ ఒకరు. ఆయన తీసిన 'రజనీగంధ' చాలా మందిని మెప్పించిన సినిమా.
అమూల్ పలేకర్, విద్యాసిన్హా ముఖ్య జంట. ఆ తర్వాత వచ్చిన చోటీసే బాత్, పతీ పత్నీ ఔర్ ఓ' అనే సినిమాలు విద్యాసిన్హాకి గుర్తింపు తెచ్చాయి.
విద్యాసిన్హాది సినీకుటుంబమే.తండ్రి, తాతలిద్దరు సినీనిర్మాతలే. తండ్రి ప్రతాప్ వి. రాణా ఆయన మామగారు మోహన్ సిన్హా. విద్యాసిన్హా స్వాతంత్రం వచ్చిన మూడు నెలలకు ముంబాయిలో పుట్టింది. సినీవాతావరణంలో పెరిగిన విద్యాసిన్హా ఆ రంగం మీద మక్కువ పెంచుకున్నా నేరుగా అటువైపు వెళ్ళ లేదు. కాలేజీ కార్యక్రమాలలో హడావుడి చేసింది.
ఆ తర్వాత అందాల పోటీల్లో పాల్గొని మిస్ ముంబాయి అనిపించుకుంది. కొన్ని వ్యాపార ప్రకట ల్లో మోడల్గా పనిచేసింది. ఒక బ్యూటీ ఫంక్షన్లో విద్యాసిన్హాని చూసిన బాసు ఛటర్జీ తన 'రజనీగంధ'కి రోయిన్ దొరికిందని సంబరపడ్డాడు. వారి కుటుం గాన్ని కలవటం సినిమాకు ఒప్పించటం జరిగింది. అయితే అది విద్యాసిన్హాకు గుర్తింపు తెచ్చిన సినిమానే కాని తొలిసినిమా కాదు.
'రాజాకాకా' అనే సినిమా తొలిగా విడుదలైంది.1980 వరకు హీరోయిన్గా బిజీగా వున్న విద్యాసిన్హాకి ఆ తర్వాత క్రమంగా ఆఫర్స్ తగ్గాయి. 'లవ్ స్టోరీ' సినిమాలో కుమార్ గౌరవికి తల్లిగా నటించింది. పాత తరం హీరో రాజేంద్రకుమార్ కి భార్య పాత్ర అది. రాజ్సిప్పీ తీసిన 'జోష్'లో విలనీ పాత్ర వేసింది.
విద్యాసిన్హా టీనేజ్లోనే, పక్కింటి తమిళ అబ్బా యితో ప్రేమలోపడింది. పక్కింటి అమ్మాయి' ఇమేజ్ వున్న తాను పక్కింటి అబ్బాయితో ప్రేమలో పడటం అని నవ్వుతుండేది. ఆ జంటకు పిల్లలు లేరు.
ఒక అమ్మాయిని పెంచుకుని, ఆమెకు పెళ్ళిచేసి పంపించారు. ప్రేమించి పెళ్ళిచేసుకున్న వెంకటేశ్వరన్ అయ్యర్ 1996లో మరణించటంతో విద్యాసిన్హా సినిమాలకు దూరంగా జరిగింది.
ఎవరినీ కలిసేది కాదు. ఒంటరిగా తన భవనంలో తాను వుండేది. సినీరంగంలో ఆర్జించినది, తల్లిదం డ్రుల నుండి వచ్చినది కలిపి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. కాని జీవితంలో ఒంటరితనం, సినీరంగంలో స్నేహితులు తక్కువ.
సినీరంగంలో ఒకసారి షూటింగ్ స్పాట్లో కనిపించటం మానేస్తే ఇట్టే మరచిపోతారు. అదే విద్యాసిన్హా విషయంలోనూ జరిగింది. అలాంటి మానసికస్థితిలో విద్యాసిన్హా కంప్యూటర్తో కాలక్షేపం మొదలు పెట్టింది. అప్పుడే వచ్చిన ఫేస్బుక్ ఆమెకు ఆసరా అయింది. ఆ ఫేస్బుక్ ద్వారా ఎందరెందరినో స్నేహి తులుగా స్వీకరించింది.
వారితో పలు రకాలుగా ఛాటింగ్ చేస్తుండేది. తన గురించి చెప్పుకునేందుకు ఒక అవకాశం, మనుషులెవరో తెలియకపోయినా వారి వింటున్నారన్న తృప్తి ఫేస్బుక్ ద్వారా పొందింది విద్యాసిన్హా.
అప్పుడు ఆమె వయసు 54 ఏళ్ళు. ఆ వయసులో ఆమెకు ఫేస్బుక్లో ఒకరు పరిచయం అయ్యాడు. ఆయన ఆస్ట్రేలియాలో పనిచేస్తున్న భారతీయ వైద్యుడు. ఇద్దరి మధ్య కబుర్లు పెరిగాయి.
ఆస్ట్రేలియా నుండి ముంబాయికి విద్యాసిన్హా కోసమే అతనువచ్చాడు. ఆ ఇద్దరు కలిసి ముంబాయి తిరిగారు. ఆ తర్వాత విద్యాసిన్హా అతనికి అతిథిగా ఆస్ట్రేలియా వెళ్ళింది. అలా ఆ ఇద్దరు బాగా దగ్గర య్యారు. నాలుగేళ్ళ తర్వాత వారిద్దరు పెళ్ళిచేసుకో వాలనుకున్నారు. ముంబాయిలోని గుడిలో పెళ్ళిచేసు కుని అంథేరిలోని ఒక ప్లాట్లో కాపురం మొదలు పెట్టారు. అప్పటికి విద్యాసిన్హా వయసు 58 ఏళ్ళు.
ఆ వయసులో పెళ్ళి అనుభవం కొత్తగా వుంది. వింతగా వుంది అన్నది విద్యాసిన్హా. కాని వారి కాపురం మూడునాళ్ళముచ్చట అయింది. నాలుగేళ్ళు తిరగ కుండానే వారి మధ్య విభేదాలు వచ్చాయి. అవి తీవ్ర మయ్యాయి. తనను హింసపెడుతున్నాడంటూ 62 | ఏళ్ళ విద్యాసిన్హా పోలీసు స్టేషన్కి వెళ్ళింది.
అప్పుడు అది ఒక సంచలనం. ఆమె వయసు, నటి కావటం వంటివి ఆ సంచలనానికి కారణం. మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న నేరంపై ఆమెభర్తను అరెస్టు చేశారు. విడాకులకోసం కోర్టుకు వెళ్ళి, చాలా కాలం పోరాటం చేసి అతనినుండి భరణం సంపాదించింది.
వివాహం విఫలమవటం, ఆ సంసారబంధంలో అనుభవించిన హింసలనుండి మనసు మరల్చుకునేం దుకు టెలివిజన్ సీరియల్స్లో నటించటం మొదలు పెట్టింది. 2005 నుండి సెకండ్ ఇన్సింగ్స్ మొదలైంది. పలు సీరియల్స్ చేసింది. కొన్ని కార్యక్రమాలను నిర్వ హించింది. దాదాపు చివరి సంవత్సరం వరకు టెలి విజన్ సీరియల్స్ చేస్తూనే వుంది.
2011లో విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమా 'బాడీగార్డ్'లో విద్యాసిన్హా మిసెస్ రాణా అనే పాత్రలో కనిపించింది. అదే ఆమె ఆఖరి సినిమా. టి.వి. షూటింగ్ అయిపోయి ఇంటికిచేరితే ఒంటరితనం.స్నేహితులు, బంధువులు అంతగా లేరు. ఒక రకమైన కుంగుబాటు మీదపడుతున్నా వయసు. డెబ్బైఏ అడుగు పెట్టటం ఊపిరితిత్తుల సమస్య మొదలైంది. శ్వాసకోశ ఇబ్బంది నుండి బయటపడటం కష్టమైంది.
చివరి మూడు నెలలు శ్వాస పీల్చటం ఇబ్బంది. అవటంతో వెంటిలేటర్ మీద పెట్టారు. అది కూడా ఆమెను బ్రతికించలేదన్న వైద్యులు క్రమంగా ఆ లైవ్ సపోర్ట్ తీయటంతో ప్రాణం నెమ్మదిగాపోయింది. పక్కింటి అమ్మాయి' పరలోకానికి చేరింది.
0 Comments