Header Ads Widget

header ads
header ads

యూ థాంట్ జీవిత చరిత్ర తెలుగు || యూ థాంట్ బయోగ్రఫీ తెలుగు

 ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా పదేళ్ళ పాటు పనిచేశాడు యు థాంట్. అన్ని సంస్థ త్సరాలపాటు ఆ కీలక పదవిలో పనిచేయటం యు థాంట్ సాధించిన విజయం. కాని తన స్వదేశమైన బర్మా (నేడు మయన్మార్)లో శాంతిని స్థాపించలేక పోవటం ఆయన వైఫల్యం. శాంతిని సాధించలేకపోన టమే కాదు, చివరికి ఆయన మరణం బర్మాలో అశాంతికి కారణమవటం మరొక చిత్రం.



మన దేశంలో ఉపాధ్యాయుడిగా జీవితం ఆరం భించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి హోదాకి ఎద గటం గర్వంగా చెప్పుకుంటాం. అలాగే యు థాంట్ కూడా ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించి ఐక్య రాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా ఎదిగాడు. కాని ఆ విషయం బర్మీయులు గొప్పగా చెప్పుకోరు.


అధ్యాపకుడిగా, వైస్ ఛాన్స్లర్గా పని చేస్తున్న రాధాకృష్ణన్ రాజకీయ నాయకుల దృష్టిలో పడటంతో ఆయన సేవలను దౌత్యవేత్తగా, ఆ పైన విద్యాకమిటీ సంస్కరణ విధాన రూపకర్తగా, ఉపరాష్ట్రపతి రాష్ట్ర పతిగా వినియోగించుకున్నారు. సరిగా యు థాంట్ కూడా తన సహాధ్యాయి దేశానికి ప్రధాని అవటంతో ఆయనకు కొత్త అవకాశాలు అందివచ్చాయి.


 "నేను పుట్టింది బౌద్ధమతంలో. నా మతం బోధిం చింది శాంతిని. కాబట్టే నేను ఎప్పుడూ శాంతిగురించే ఆలోచిస్తాను, శాంతికోసం ప్రయత్నిస్తాను" అంటూ తన జీవిత ఫిలాసఫీని చెప్పిన యు థాంట్ బర్మాలోని విద్యావంతుల కుటుంబంలో పుట్టాడు.


నాటికి బర్మా భారతదేశంలో భాగం. ఆయన తండ్రి కలకత్తాలో చదువుకున్నాడు. బర్మాలోని వారి ప్రాంతంలో ఇంగ్లీషు తెలిసిన ఏకైక కుటుంబం థాంట్లది. యు థాంట్లోని 'యు' అనేది గౌరవ సూచన పదమేగాని పేరులో భాగం కాదు.


సర్నాలుగేళ్ళ వయస్సులో డిగ్రీ చదువుతున్న థాంటి కి తండ్రి మరణం ఆర్థిక ఇబ్బందులు తేడా చదువు వదిలి తన సొంత ఊరిలో స్కూల్ టీచర్ అయ్యాడు. పాతికేళ్ళ వయస్సుకల్లా హెడ్మాస్టర్ అయ్యాడు. జాతీయ, అంతర్జాతీయ అంశాలమీద పత్రికలకు వ్యాసాలు రాస్తుండేవాడు.


అలా విద్యారంగంలో, పత్రికా రంగంలో థాంటికి గుర్తింపు వచ్చింది. 1948లో బర్మాకి స్వాతంత్య్రం వచ్చినప్పుడు థాంట్ క్లాస్మేట్ అయిన ను దేశానికి ప్రధాని అయ్యాడు. దేశంలో అంతర్యుద్ధం మొదలైనప్పుడు దానిని అదుపు చేసేందుకు, భిన్నవర్గాల మధ్య శాంతి చర్చలు జరిపే బాధ్యతను ఇంటికి అప్పగించగా దానిని నిర్వహించటంలో ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొన్నాడు.


పరిస్థితి చక్కబడినతర్వాత ప్రధానికి వ్యక్తిగత కార్యదర్శి అయ్యాడు. ప్రభుత్వ అధికార యంత్రాం గంలోకి తీసుకుని సమాచార శాఖ కార్యదర్శిగా నియమించారు. పలు అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించటంలో సఫలమైన థాంటిని బర్మా దేశం ఐక్యరాజ్య సమితిలో తమ దేశ శాశ్వత ప్రతినిధిగా నియమించింది. ఐక్యరాజ్యసమితిలో సమస్యలు ఎదురైన దేశాల మధ్య మధ్యవర్తిగా వ్యవహరించటంలో దిట్టగా యు థాంట్ గుర్తింపు పొందాడు.


 1961లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్య దర్శి విమాన ప్రమాదంలో మరణించగా తదుపరి ప్రధాన కార్యదర్శి ఎవరనేదానిమీద అమెరికా, సోవి యట్ యూనియన్లు ఏకాభిప్రాయానికి రాలేక పోయారు. అప్పుడు రాజీమార్గంగా యు థాంట్ని ఆ పదవికి అంగీకరించారు.


ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా అమెరికా, సోవియట్ నాయకులను చర్చల్లో కూర్చోపెట్టగలిగాడు. క్యూబా మిసైల్ సంక్షోభం నివారించగలిగాడు. తన పదేళ్ళ పదవీ కాలంలో యు థాంట్ పలు సమస్యలు పరిష్కరించాడు. అరబ్, ఇజ్రాయిల్ యుద్ధ నివారణ, వియత్నాం యుద్ధంలో అమెరికన్ జోక్యం అంశంవంటివన్నీ ఆయన జోక్యం చేసుకుని నిలువరించినవే. చైనాకి ఐక్యరాజ్యసమితి సభ్యత్వం ఆయన హయాంలో వచ్చింది.


ఐక్యరాజ్యసమితి ఏవైపు మొగ్గకుండా, తన లక్ష్యం వైపు నడుస్తుంది అని స్పష్టంచేసి, నిరూపణతో నడి పించిన యు థాంటినే తిరిగి మూడవసారి ఆ పదవిలో కొనసాగాలని అన్ని దేశాలు అడిగినా ఇక ఆ పదవిలో ఉండలేను, అందరితో మంచి అనిపించుకుంటున్న లోకి వేళనే పదవి వదిలేయటం మంచిదని మనస్సులో అనుకున్నాడు. అంత విజయం సాధించిన యు థాంట్ 1971లో ఐక్యరాజ్యసమితి వదిలినా 


 తాను సాధించుకున్న మంచి పేరుతో స్వదేశం మాత్రం అడుగు పెట్టలేదు. తన శేష జీవితం అమెరికాలో గడపాలని నిశ్చయించుకున్నాడు.


ఐక్యరాజ్యసమితిలో అమెరికాకి ఇబ్బందులు రాని వ్వని సెక్రెటరీ జనరల్ గా భావించుకున్న అమెరికా 'యు థాంటిని అడ్లాయ్ స్టీవెన్సన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో సీనియర్ ఫెలోగా నియ మించింది. "పదవీ భారం భరించటం ఎంతో కష్టం, నా జీవితానికి స్వాతంత్ర్యం వచ్చినట్టుగా అన్నాడు యు థాంట్. అప్పటికే బర్మాలో సైనిక నియంతృత్వం వచ్చింది. నాటి అధ్యక్షుడు నే విన్, యు థాంట్ దేశంలోకి వస్తే ప్రజలు ఆయనపక్షాన నిలిస్తే, తన పదవికి ఎసరుపెడతాడన్న భయం.


యు థాంట్కి దేశంలోకి ప్రవేశంలేదన్న సంకే తాలు ఇచ్చాడు. సొంత దేశం గౌరవించని జీవితం ఏ జీవితమనే బాధ యు థాంట్ని వేధించింది. కాని బర్మాలోకి అడుగుపెట్టే సాహసం చెయ్యలేదు.


రిటయిర్మెంట్ తరువాత ఆయన జీవించిన మూడేళ్ళు అధ్యయనంలో గడిపిన యు థాంటి ని క్యాన్సర్ కబళించింది. నవంబర్ 25న మరణించిన యు థాంట్ పార్థివ దేహం రంగూనికి వస్తే అధి కార లాంఛనాలు లేవు. గౌరవభావంతో వెళ్ళిన ఒక మంత్రిని పదవిలోంచి డిస్మిస్ చేశాడు.


ఆయన పార్థివ దేహం శ్మశానానికి చేరేముందు ఒక విద్యార్థి బృందం హఠాత్తుగా దాడిచేసి ఆ శవపేటి కను లాక్కెళ్ళి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఖననం చేశారు. ప్రభుత్వం కాల్పులు జరిపి విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకుని, సమాధిని తవ్వితీసి పదిరోజుల తరు వాత మరో చోటుకు తీసుకువెళ్ళి. ఎవరూ చుట్టూ లేకుండా చూసి మరోమారు ఖననం చేశారు.


ప్రపంచశాంతి కాముకుడు యు థాంట్ అంత్య క్రియలు చివరికి బర్మాలో యు థాంట్ సృష్టించిన సంక్షోభంగా గుర్తుండిపోయింది.



Post a Comment

0 Comments