Header Ads Widget

header ads
header ads

అమలా శంకర్ జీవిత చరిత్ర తెలుగు || బయోగ్రఫీ

 అమలా శంకర్ నూటొక్క సంవత్సరాలు జీవించింది. సంపూర్ణంగా జీవితం అనుభవించటం అంటే ఏమిటో ఆమెనుండే నేర్చుకోవాలి. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వాటినన్నింటిని ఎదుర్కొంటూ ముందడుగు వేసిన సాహసి ఆమె.



భర్త ఉదయ్ శంకర్తో కలిసి భారతీయ సాంప్ర దాయ నృత్యకళను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళింది. ఉదయ్ శంకర్ పేరెన్నికగన్న నాట్య కారుడు. ఆయనే అమలకి నాట్యం నేర్పిన గురువు.


ఆ తర్వాత భర్త. ఆ జంట కలిసి ఇచ్చిన ప్రదర్శ వలు 1940-50ల్లో దేశ,విదేశాలలో నాట్యాభిమాను లను ఉర్రూతలూగించాయి.


అమల శంకర్ జూన్ 27, 1919న ఒక వ్యాపార కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రి ఆయ్ కుమార్ నంది నగల వ్యాపారి. భారతీయ సాంప్రదాయ నగలను విదేశాలకు ఎగుమతి చేస్తుండేవారు.



1931లో తండ్రి ప్యారిస్ నగల ప్రదర్శనకెళుతూ కూతురుఅమలను తీసుకువెళ్ళాడు. ప్యారిస్లో నాడు గడిపిన సమయం ఆమె జీవితాన్ని మార్చింది.


ఆసమయానికి నృత్యంలో పేరుపొందిన ఉదయ్ శంకర్ తన నృత్యబృందంతో ప్యారిస్లో ప్రదర్శనలు ఇస్తున్నాడు. ఉదయ్ శంకర్ సోదరుడు సితార విద్వాం సుడు రవిశంకర్. వారి కుటుంబానికి బెంగాల్లో మంచి గుర్తింపు వుంది. అటువంటి కుటుంబం పరిచయం అవటమే ఒక అదృష్టమైతే అమలలో నర్తకి వుందన్న విషయం ఉదయ శంకర్ గుర్తించటం మరో గొప్ప అవకాశం.


కాళ్ళు, చేతులు అటూ ఇటూ కదిలించేలా చేసి ఇక నువ్వు చెప్పాల్సిందల్లా నేను చెప్పినట్లు చెయ్యటమే అని ఉదయ్ శంకర్ చెపితే సరేనని తల ఊపింది. వెనువెంటనే అమలను తన బృందంలోకి తీసుకుని, ప్రదర్శన ఇప్పించాడు. వీలైనంత వేగంగా నాట్యంలో మెలకువలు నేర్చుకుంది.


1942లో మద్రాసులో నృత్యప్రదర్శన ఇస్తున్న వేళ. తనను పెళ్ళాడమని ఉదయ్ శంకర్ అడగటం అమల అంగీకరించటం జరిగింది. ఆ సంవత్సరమే కొడుకు ఆనందశంకర్ పుట్టాడు. దేశమంతా విస్తృతంగా ప్రద ర్శనలిచ్చే ఆ జంటకి సినిమా తీసే ఆలోచన వచ్చింది. అమల హీరోయిన్, ఉదయ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన కల్పన "సినిమా 1948లో ఒక సంచలనం. మరో అందాల నృత్యతార హిందీ సినీరంగానికి లభించిం దాని పొంగిపోయారు. అయితే అమలకి నాట్యంమీద తప్పించి సినిమాల మీద ఆసక్తిలేదు.


1955లో కూతురు మమత శంకర్ పుట్టింది. ఆజంటను చూస్తే అందరికీ ఆనందంగా వుండేది. ఒక గొప్ప రొమాంటిక్, ఆరాధనా భావం పరస్పరం కలిగిన జంటగా అందరూ చెప్పుకునేవారు. ఆ జంట అన్యోన్యత, ప్రేమను చూసి కన్నుకుట్టిందేమో విధికి తెలియదు. కాని అమలకు ఒకరోజు ఒక షాకింగ్ విషయం తెలిసింది. తన భర్త ఉదయ్ శంకర్ తమ నృత్యబృందంలో పనిచేస్తున్న ఒక యువతితో రొమాంటిక్ సంబంధం పెట్టుకున్నాడనేది ఆమెకు

తెలిసిన విషయం.


భర్తను మరొకరితో పంచుకునేంత విశాల హృదయం కాదు నాది అంటూ ఇంట్లోనుండి బయటకు వచ్చింది. అప్పటికి ఆమె వయసు 63 ఏళ్ళు. ఉదయ్ శంకర్ వయసు 74 ఏళ్ళు. తమది ఇక నుండి నృత్య బంధమే కాని భార్యాభర్తల బంధం కాదని చెప్పింది. వారిద్దరు కలిసి స్థాపించిన డ్యాన్స్ అకాడమీ బాధ్యతలు కొనసాగించింది.


1977లో ఉదయ్ శంకర్ మరణించాడు. నాటి నుండి అమలాంకరిది ఒంటరి జీవితమే. కాని ఉత్సాహం ఏమాత్రం తగ్గని జీవితం. ఆ జంట ఆరంభించిన నృత్యశిక్షణ కేంద్రంలో అన్ని భారతీయ శాస్త్రీయ నృత్యరీతులను శిక్షణనిచ్చేవారు. ఆ సంస్థకు డైరక్టర్గా ఆమె పనిచేస్తుండేది.


ఎన్నడూ జీవితం మీద విసుగులేదు అమలకు అంతా చలాకీతనమే. ఆమెకు 88 ఏళ్ళు వయసు న్నప్పుడు కొడుకు ఆనందశంకర్ మరణించాడు. ఆ బాధను ఆమె దిగమింగింది. నేను నృత్యంలోనే బ్రతుకుతాను ఈ లోకానికి ఏమైనా అనవసరం అనేది. ఆమెలోని ఆ పట్టుదల, ఆత్మస్థైర్యం చూసి అంతా ఆశ్చర్యపోయేవారు.


తీరిక సమయం అని ఎవరైనా అడిగితే అమలకు చిరాకు వేసేది. తీరికగా వుండటం ఏమిటి! ఎవ ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో వుండాలి కాని అని చెప్పేది అమలాశంకర్,


డాన్స్ క్లాసులు లేకుంటే అమల పెయింటింగ్ వేసేది. వేళ్ళు, గోళ్ళు పళ్ళలో పదార్థాలు తీసే చెక్కపుల్లలనే బ్రష్లుగా వాడి చిత్రాలు గీసేది. అడపా * నృత్యాల మీద వ్యాసాలు రాసేది.


ఇక నా జీవితం అయిపోయిందని మిగిలిన వారినరైనా అనుకునే వయసు 90సంవత్సరాలు. కాని అమలాశంకర్ అందరిలాంటిది కాదు. 92 ఏళ్ళ వయసులో ఆమె నృత్యప్రదర్శన సీతా స్వయంవర్ లో జనకుడి పాత్రవేసింది. ఆమె నటించిన 'కల్పన సినిమా పాత ప్రింట్ని కొత్తదిగా చేసి కెన్నిన్లో ప్రదర్శిస్తూ అమలను ఆహ్వానిస్తే హుషారుగా ఫ్రాన్స్ వెళ్ళింది. వేదిక మీదికి ఆహ్వానిస్తే "నా అంత యువకళాకారిణి మరెవరూ ఇక్కడ లేరేమో" అంటూ ఎక్కింది. వేదిక మీదంతా ఆమె హుషారు చూసి అంతర్జాతీయ కళాకారులు ఆశ్చర్యపోయారు.


వయసుతో వచ్చే ఇబ్బందులు వస్తున్నాయి. నువ్వు జాగ్రత్త అని కూతురు, ఇతరులు హెచ్చరిస్తే "మీరేమీ

కంగారుపడకండి. నా జీవితంలో నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. చివరిరోజు వరకు ఎవరిని ఇబ్బంది. పెట్టను" అని చెప్పేది.


2018లో ఆమె వందవ పుట్టినరోజు కలకత్తాలో శిష్యులంతా కలిసిచేస్తుంటే చిన్నపిల్లలా వారితో కలిసి పోయింది. తన వయసు ఇబ్బందులను మరెవరికి చెప్పేది కాదు. "ఈ లోకంలోకి ఎటువంటి హడావుడి లేకుండా వచ్చాం. అంతే నిశ్శబ్దంగా వెళ్లిపోవాలి మనం". అని అమలాశంకర్ తన 101వ పుట్టినరోజు నాడు చెప్పినట్టే, జూలై 24, 2020న నిద్రలోనే గుండెపోటుతో మరణించి తన మాట నిలబెట్టుకుంది.





Post a Comment

0 Comments