Header Ads Widget

header ads
header ads

పుష్ప వల్లి జీవిత చరిత్ర తెలుగు || బయోగ్రఫీ తెలుగు

 బాలనటిగా వచ్చి ఆ తర్వాత అందనంత ఎదిగిన శ్రీదేవి, రేఖవంటివారి గురించి ఘనంగా చెప్పుకుంటారుకాని, బాలనటిగా వచ్చి, జీవితంలో ఎదురు దెబ్బలు తిని, ఎలా ముందుకు అడుగు వేయాలో తెలియక, పరిస్థితులు ఎలా నడి పిస్తే అలా నడిచి, జీవన పోరాటంలో చిట్టచివరి రోజు వరకు కష్టాలనే అధికంగా అనుభవించి, మౌనంగా లోకం వదిలి వెళ్ళిపోయిన నటి పుష్పపల్లి


దక్షిణాది సినీరంగంలో కళ్ళుచెదిరే తొలితరం అందాల తారలగురించి చెప్పుకుంటే తక్షణం గుర్తుకు వచ్చే పేర్లు కాంచనమాట, పుష్పవల్లి, ఇప్పుడు సినీరంగంలో ఒకస్థాయి విజయం తర్వాత "నా జీవితం.... నా ఇష్టం.... నా జీవితం... నా నిర్ణయం' అంటూ ధిక్కారస్వరం వినిపిస్తున్నవారున్నారు.



అటువంటి ధిక్కార జీవితం 80 ఏళ్ళ క్రితమే గడిపిన నటి పుష్పవల్లి. ఆమె నటించిన సినిమాలు 40కి మించవు. అందులో అద్భుతంగా గుర్తున్న సినిమా పేర్లు ఉన్నాయి. కానీ ఆ సినిమాలో ఆ పాత్ర వేసిన పుష్పవల్లి 1926-1991 (65 ఏళ్ళు). చివరి రోజుల్లో పుష్పవల్లి ఎవరికీ గుర్తులేదు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు గ్రామంలో ఒక సాంప్రదాయ వైష్ణవ కుటుంబంలో పుట్టిన కందాళ పుష్పవల్లి తాయారమ్మ సినిమా పిచ్చి స్కూల్ స్థాయి చదువు కూడా సరిగా సాగనివ్వలేదు. అప్పుడప్పుడే టాకీ వస్తున్న కాలం, మద్రాసు సినీ కేంద్రం కాలేదు.


రాజమండ్రిలో స్టూడియో పెట్టారు. అలా ఆ సినీ పిచ్చి పుష్పవల్లికి సినీ నిర్మాణం గోదావరి జిల్లాకే వచ్చింది. 1936లో 9 ఏళ్ళ వయస్సులో సంపూర్ణ రామాయణం'లో మొదటి సీతగా నటించింది. అందమైన, అమాయకమయిన ముఖం, ఫోటో జెనిక్ పుష్పవల్లి నాటి సినీదర్శకులు హెచ్.ఎమ్.రెడ్డి, సి.పుల్లయ్యలను ఆకట్టుకుని ఆఫర్స్ ఇప్పించాయి. పూనా, కలకత్తాలలో సినీ నిర్మాణాల తరువాత చివ రికి మద్రాస్ చేరింది వారి కుటుంబం..


 20 ఏళ్ళవయసులో ఒక వకీలుకి భార్య అయింది. సినిమా పిచ్చిని పెళ్ళి తగ్గిస్తుందనుకుంటే, అయిదేళ్ళ కాపురం తర్వాత వివాహబంధమే దూరమయింది. వ్యక్తిగత జీవితంలో ఇబ్బంది వచ్చినా సినీరంగంలో విజయం వస్తుందనుకుంటే, జెమిని ఫిల్మ్ వారు పకద్బందీగా రాయించుకున్న ఒప్పందం మరే సంస్థ ఆఫర్స్ ని అంగీకరించటానికి అడ్డంకి అయింది.


ఆ కుంగుబాటు ఆమెను అప్పుడప్పుడే సినిమాల్లో కనిపిస్తున్న జెమినీ గణేశనికి దగ్గర చేసింది. 1950ల్లోనే సహజీవన సాహసం చేసింది. జెమినీగణేశద్వారా ఇద్దరు అమ్మాయిలకు తల్లి అయింది. కాని ఆ బిడ్డలకు తాను తండ్రి అని జెమినీ అంగీకరించలేదు.


 దక్షిణాది సినీరంగంలో కళ్ళుచెదిరే తొలితరం అందాల తారలగురించి చెప్పుకుంటే తక్షణం గుర్తుకువచ్చే పేర్లు కాంచనమాట, పుష్పవల్లి. ఇప్పుడు సినీరంగంలో ఒకస్థాయి విజయం తర్వాత 'నా జీవితం... నా ఇష్టం...ధిక్కార స్వరం వినిపిస్తున్నవారున్నారు. నాజీవితం...నా నిర్ణయం' అంటూ అటువంటి ధిక్కార జీవితం 80 ఏళ్ళ క్రితమే గడిపిన నటి పుష్పవల్లి.


గ్లామర్ వున్నా హీరోయిన్ వేషాలు తక్కువ వచ్చాయి. చేసిన సినిమాలు ఆడలేదు. చివరికి పిల్ల లను పెంచేందుకు ఎవరు ఎటువంటి పాత్ర ఇచ్చినా అంగీకరించింది. కనీస అవసరాలు తీర్చలేని తన దౌర్భాగ్య స్థితికి ఎప్పుడూ ఏడుస్తుండేది.


 అదే సమయంలో తన సంతానానికి తన గతి పట్టకూడదని డాన్స్ నేర్పించింది. తను చెప్పగలిగిన నటనా పాఠాలు నేర్పించింది. పిల్లలిద్దరినీ బాల నటు లుగా నిలబెట్టేందుకు స్టూడియోలచుట్టూ తిరుగు తుండేది.'రంగుల రాట్నం' సినిమాలో తల్లి పుష్పవల్లి, పిల్లలు భానురేఖ, ఆమె చెల్లి నటించారు.


పదహారెళ్ల వయసులో తన అదృష్టం హిందీ రంగంలో తేల్చుకుంటానని రేఖ బొంబాయి కి వెళతానానపుడు తాను వెంట వెళ్ళింది అలా 1969లో బంగారం పంజరం సినిమాతో నాటి పుష్పవల్లి కెరీర్ ముగిసింది. అప్పటినుండి పిల్లలదే లోకం.


రేఖ 1978కి బాలీవుడ్లో నిలదొక్కుకోగలిగింది. ఈలోగా పుష్పవల్లి పోటోగ్రాఫర్ ప్రకాష్న వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు సంతానం.


ఇక ఒడుదుడుకులు లేకుండా జీవితం గడిచిపోతే. చాలు అనుకున్నది పుష్పవల్లి. రెండవ కూతురు రాధ పెళ్లాడి గి, అక్కడినుండి అమెరికాకి వెళ్ళిపోయింది. పుష్పవల్లి అమెరికా వెళ్ళి.. కొంతకాలం ఉండివచ్చినా ఆమె బాధ అంతా రేఖ జీవితం తన జీవితంలా ఔతుందేమోనన్న భయంతో నిండిపోయింది. లేఖ అంటే హీరోలకు పిచ్చి,


ఎవరోకరిని పెళ్ళాడి జీవితంలో స్థిరపడు, నాలాగా అలా అలా ఎవరో ఒకరితో గడపకు అని తల్లిగా పుష్పవల్లి హెచ్చరికలు చేస్తుండేది. కాని రేఖకూడా. జీవితంలో స్థిరపడలేదు. పైగా కూతురు ఎఫైర్స్ మీద పలురకాల కథలు వస్తుండేవి. వాడిని పెళ్ళాడింది. వీరితో కలిసివుంటుందనే వార్తలు వచ్చినప్పుడల్లా బొంబాయి వెళ్ళి రేఖకి నచ్చచెప్పాలని ప్రయత్నించి, కన్నీళ్ళు పెట్టుకుని వెనక్కి వచ్చేది.


ప్రకాష్ ద్వారా కలిగిన సంతానం. వారిని జాగ్రత్తగా పెంచి, ప్రయోజకులను చెయ్యటం అనే బాధ్యతను వదలలేదు పుష్పవల్లి. రేఖ విజయం తర్వాతగాని జెమినీ గణేష్ ఆమె తన కూతురు అని బహిరంగంగా అంగీకరించలేదు. కాని అప్పటికే రేఖ మనస్సు విరిగిపోయి జెమినీని తండ్రిగా తిరస్కరించింది.


అది పుష్పవల్లికి బాధ. సావిత్రి 1981లో మరణించినప్పుడు వెళ్ళిన కొద్దిమందిలో పుష్పవల్లి వుంది. తన కష్టం గురించి బయటకు చెప్పుకునేది కాదు. తనజీవితంలో 'అనూహ్య మార్పులకు, పడిన బాధలకు ఎవరినీ నిందించేది కాదు. నేను ఎంచుకున్న జీవితానికి నేను బాధ్యురాలిని అనేది పుష్పవల్లి.


మానసిక ఒత్తిడి, వయసులో వున్నప్పుడు సరిగా అందని పోషకపదార్థాలు ఆమె శరీరాన్ని డయాబెటీ సీకి గురిచేసింది. ఆమెకున్న ఇతర అలవాట్లు గురించి తెలియదు. కాని మానసిక ఒత్తిడి అంశం ప్రభావం చూపింది. ఎవరి జీవితం గురించి తాను అంతగా బాధపడిందో ఆ రేఖ "అమ్మా. నేను పెళ్ళి చేసుకుంటున్నా" అని చెప్పినప్పుడు పొంగిపోయింది.


తన పెద్ద కూతురు ఇక స్థిరపడుతున్నదన్న ఉత్సా హం ఆమెలో కనిపించింది. కాని రేఖ భర్త 1990లో డిప్రెషన్కి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. 'మొగు ని చంపిన రేఖ', 'ఆమె ఒక రాక్షసి' అంటూ బాలీ వుడె వెంటాడింది. పుష్పవల్లి ఆనందం ఆవిరైపోయింది. ఆమె కుంగుబాటు డయాబెటిస్ని పెంచింది.


కీలక అంగాలమీద ప్రభావం చూపి, చివరి 15 పదహారేళ్ళ వయస్సులో తన అదృష్టం హిందీ రోజులు వడపళనిలోని ఆసుపత్రిలో వుండి 1991లో. రంగంలో తేల్చుకుంటానని రేఖ బొంబాయికి వెళతా కాలం చేసింది. 'నా జీవితం నా ఇష్టం' అన్నట్లుగానే నన్నప్పుడు తాను వెంట వెళ్ళింది. అలా 1969లో వెళ్ళిపోయిందా! లేక ముందు తరం నటులకు పుష్ప 'బంగారు పంజరం' సినిమాతో నటిగా పుష్పవల్లి | పల్లి జీవితం ఒక పాఠంగా నిలిచిందా?

Post a Comment

0 Comments